ట్రాఫిక్‌లో అంబులెన్స్.. దక్కని చిన్నారి ప్రాణం!

TG: ఖమ్మం జిల్లా, బోనకల్‌కి చెందిన రెండేళ్ల వైభవ్ నాయక్.. కొన్ని రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్నాడు. పరిస్థితి విషమించడంతో ఖమ్మంలోని ఆస్పత్రికి తీసుకొచ్చారు. అక్కడి నుంచి మరో ఆస్పత్రికి వెళ్తుండగా.. గణేష్ ఊరేగింపు ట్రాఫిక్‌లో అంబులెన్స్ చిక్కుకుంది. దీంతో తండ్రి సైదులు కొడుకును భుజాలపై మోసుకుంటూ ఆస్పత్రికి తీసికెళ్ళాడు. కానీ ఫలితం దక్కలేదు. సమయానికి చికిత్స అందితే తమ బిడ్డ బతికేవాడని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.



