కిలో బియ్యం ₹49కే

AP: రాష్ట్రంలోని రైతుబజార్లలో ఈరోజు నుంచి KNM రకం సన్నబియ్యం కిలో 49 రూపాయలకే అందుబాటులోకి రానున్నాయి. విజయవాడలోని భవానీపురం రైతుబజారులోని మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ అమ్మకాలకు ప్రత్యేక కౌంటర్‌ను ప్రారంభించనున్నారు. ఒక్కో కుటుంబానికి 26 కిలోల బ్యాగుల రూపంలో బియ్యం అందించనున్నారు. మార్కెట్లో పెరిగిన బియ్యం ధరలతో ప్రజలపై భారం పడకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సివిల్ సప్లైస్ అధికారులు తెలిపారు.



