మంచినీటి సమస్యపై ధర్నా.. తాగునీటి కోసం తపన!
అనకాపల్లి జిల్లాలోని కోటవురట్ల మండలంలో కాశీపట్నం పంచాయతీ పరిధిలో మంచినీటి సమస్య పరిష్కరించాలని సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. 50 కుటుంబాలు, ఇతర గిరిజనులు మంచినీటి కోసం చెరువు నీటిపై ఆధారపడుతున్నారు. ఈ నీరు తాగి అనారోగ్యం పాలవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే మంచినీటి సమస్య పరిష్కరించాలని సీపీఎం నాయకులు కే. సింగులు, టీడీపీ నాయకులు ఆర్. ఎర్రిబాబు తదితరులు డిమాండ్ చేశారు.



