పేద విద్యార్థుల చదువుకు రూ.30 వేల సాయం

పేద విద్యార్థుల చదువుకు చేయూతగా తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపులంక పంచాయతీ పరిధిలోని వెంకాయమ్మపేట ఎంపీపీ ఎంపీఎస్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు సాక అనిత రూ.30 వేల ఆర్థిక సహాయం అందించారు. చేయూత చారిటబుల్ ట్రస్ట్ 9వ వార్షికోత్సవం సందర్భంగా కాకినాడలో జరిగిన కార్యక్రమంలో ఇద్దరు విద్యార్థులను దత్తత తీసుకుని ఈ సాయాన్ని అందించారు. చేయూత ఫౌండేషన్ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షురాలిగా అనిత పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
