మొదలైన శీతాకాలం.. కురిసిన సీజనల్ Snow (video)
జమ్మూకాశ్మీర్.. అనంత్నాగ్ జిల్లా ఎత్తైన ప్రాంతాల్లో ఈ సీజన్లో మొదటిసారి మంచు కురిసింది. అక్టోబర్ 14 ఉదయం పర్వత శిఖరాలు తెల్లటి మంచుతో కప్పుకొని అందమైన దృశ్యాలు కనిపించాయి. ఈమధ్య కాశ్మీర్ లోని గుల్మార్గ్, సోనమార్గ్, జోజిలా, గురేజ్ వ్యాలీ, రజ్దాన్ పాస్ వంటి చోట్ల కూడా తాజా మంచు కురవగా, మైదాన ప్రాంతాల్లో వర్షాలు పడి చల్లదనం పెరిగింది. త్వరలో మరిన్ని వర్షాలు, మంచు కురవొచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ మార్పు శీతాకాలం ప్రారంభమైందని సూచిస్తోంది.


