వినాయక నవరాత్రులు: పోలీస్ రూల్స్ మస్ట్!

నల్లబెల్లిలో వినాయక ఉత్సవాలను నిర్వహించేందుకు పోలీస్ రూల్స్ తప్పక పాటించాలని నర్సంపేట రూరల్ CI శంకర్రావు సూచించారు. SI సాయి ప్రసన్నకుమార్ సమక్షంలో సర్పంచులు, ప్రజాప్రతినిధులు, ఉత్సవ కమిటీ సభ్యులకు అవగాహన కల్పించారు. మండపాల సెటప్, పవర్ సేఫ్టీ, నిమజ్జనం ప్రాసెస్‌లలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉత్సవాలు ప్రశాంతంగా పూర్తి కావడానికి పోలీసులకు సహకరించాలని కోరారు.
