రీ-సర్వే పురోగతి.. మందసలో జాయింట్ కలెక్టర్ సమీక్ష!

శ్రీకాకుళం జిల్లా మందస మండలంలో రీ-సర్వే పనుల పురోగతిపై జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ సమీక్షించారు. మొత్తం 83 గ్రామాలకు గాను 47 గ్రామాల్లో రీ-సర్వే పూర్తయింది. మిగిలిన 36 గ్రామాల్లో పనులు 2027 మార్చిలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. గ్రౌండ్ ట్రూతింగ్, ఈ-కేవైసీ పనులను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో తహసీల్దార్ బి.శ్రీహరి, డీటీ కె.రామకృష్ణ, సర్వేయర్ బాబురావు, ఎంఆర్ఐ ఇందిర పాల్గొన్నారు.



