నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన అడిషనల్ ఎస్పీ

చిత్తూరు జిల్లా పలమనేరు మున్సిపాలిటీ పరిధిలోని డిస్పాచింగ్ కేంద్రం, పోలింగ్ స్టేషన్లు, నామినేషన్ కేంద్రాలను అడిషనల్ ఎస్పీ ఎస్. షాను, SDPO డేగల ప్రభాకర్తో కలిసి పరిశీలించారు. పోలీసు బందోబస్తు, భద్రతా ఏర్పాట్లను సమీక్షించి, ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ పరిశీలనలో అర్బన్ CI మోహన్ రెడ్డి, SI రాజశేఖర్ రెడ్డి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.



