← Back to news

అడ్డంకులను ఎదిరించి.. సైడ్ కాలువ పనులు పూర్తి!

By rajinikanth· 19h ago· Gatlanarsingapur, Bheemadevarpalli, Hanumakonda

హన్మకొండలోని బొల్లోనిపల్లి గ్రామంలో వర్షపు నీరు రోడ్లపై నిలిచి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం సైడ్ కాలువ పనులు చేపట్టారు. కానీ కొందరు వ్యక్తులు ఈ పనులకు అడ్డంకులు సృష్టించారు. దీంతో అంగన్వాడీ కాలనీ ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. స్పందించిన సర్పంచ్, ఉపసర్పంచ్ వెంటనే రంగంలోకి దిగారు. JCB సహాయంతో పాత సైడ్ కాలువను పూర్తి చేశారు. రోడ్డుపై నిలిచిన నీటిని దిగువకు మళ్లించే పనులు చేశారు. ప్రజలకు ఊరట లభించింది. సమస్యను పరిష్కరించడంలో సర్పంచ్, ఉపసర్పంచ్ చొరవ చూపడం అభినందనీయం.

More in Local