← Back to news

కల్తీ బెల్లం కనిపెట్టడం ఎలా?

By BK· 15 Aug 2026
కల్తీ బెల్లం కనిపెట్టడం ఎలా?

బెల్లం మెరిసేలా, బరువు పెంచడానికి బేకింగ్ సోడా వంటి కల్తీలు కలుపుతున్నారు. బెల్లం మంచిదో కాదో తెలుసుకోవడానికి ఫుడ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్ (FSSAI) ఒక పరీక్ష చెప్పింది. ఒక గాజు గ్లాసు నీటిలో కొద్దిగా బెల్లం ముక్కలు వేసి, అందులో 'హైడ్రోక్లోరిక్ యాసిడ్' కొన్ని చుక్కలు కలపాలి. ఈ యాసిడ్ ప్రమాదకరమైనది కాబట్టి చేతులకు గ్లౌజులు వేసుకుని, పిల్లలకు దూరంగా జాగ్రత్తగా వాడాలి. బెల్లంలో కల్తీ ఉంటే ఆ నీళ్లు నురగలు వచ్చి రంగు మారతాయి. అసలైన బెల్లం అయితే ఏ మార్పూ ఉండదు. ఈ పరీక్షతో కల్తీని సులభంగా కనిపెట్టవచ్చు.

More in Health