బంగారి వెంకన్న మృతికి BRS నాయకుల సంతాపం

మహబూబాబాద్ జిల్లా పెద్ద వంగర మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీకి చెందిన బంగారి వెంకన్న అనారోగ్యంతో మృతి చెందారు. పాలకుర్తి దేవస్థానం మాజీ చైర్మన్ వెనుకబడిన దాసుల రామచంద్రయ్య శర్మతో పాటు మండల BRS నాయకులు మృతుడి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో BRS మండల ప్రధాన కార్యదర్శి శ్రీరామ్ సంజయ్, సీనియర్ నాయకుడు శ్రీరామ్ సుధీర్ కుమార్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు చిలుక బిక్షపతి, మాజీ ఉపసర్పంచ్ శ్రీరామ్ రాము, తదితరులు పాల్గొన్నారు.



