‘అమ్మవారి ఆవాహన’.. మూఢనమ్మకాలకేదీ ముగింపు?
ఒకవైపు ఏఐ విప్లవం ప్రపంచాన్ని కొత్తగా మారుస్తుంటే, మరోవైపు మూఢనమ్మకాలు మాత్రం ఇంకా పెరుగుతున్నాయి. బిహార్లోని వైశాలి జిల్లాలో ఒక 17 ఏళ్ల బాలికపైకి మహాకాళి దేవి ఆవహించిందంటూ ప్రచారం జరుగుతోంది. దాన్ని చూసేందుకు జనం భారీగా గుమిగూడారనే వార్త ప్రచారమవుతోంది. కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ తమ వ్యూస్ కోసం ఈ వార్తను మరింత ప్రచారం చేస్తున్నాయి. మనుషులపై దేవుళ్లు, దేవతలు ఆవహిస్తారనే వాదనకు ఎలాంటి ఆధారాలు ఉండవని హేతువాదులు అంటున్నారు.

