← Back to news

మానవత్వం చాటుకున్న ఎస్సై పెర్సిస్

By DK· 2d ago
మానవత్వం చాటుకున్న ఎస్సై పెర్సిస్

TG: భైంసా–బాసర జాతీయ రహదారిపై ఒంటరిగా ఉన్న మహిళను ముథోల్ ఎస్సై బిట్ల పెర్సిస్ చేరదీసి ఆసుపత్రిలో చేర్పించారు. నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం బినోల గ్రామానికి చెందిన సత్తవ్వ కొన్ని రోజులుగా ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు స్థానికులు తెలిపారు. వర్షంలో తడుస్తూ రహదారిపై నిద్రిస్తున్న ఆమెను స్థానికులు ప్రయాణ ప్రాంగణంలో కూర్చోబెట్టారు. సమాచారం అందుకున్న ఎస్సై అక్కడికి చేరుకుని కొత్త దుస్తులు, భోజనం అందించి అనంతరం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు.

More in Local