← Back to news

యువరైతు ఆత్మహత్యాయత్నం

By డీకే· 24 Jun 2026· Sakshi· చిత్తూరు జిల్లా
యువరైతు ఆత్మహత్యాయత్నం

AP: చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలంలో బొమ్మవారిపల్లి విలేజ్‌కు చెందిన యువరైతు లోకేశ్ నాయుడు నాలుగురోజుల క్రితం మామిడి లోడ్‌తో జైన్ మామిడి గుజ్జు పరిశ్రమకు చేరుకున్నాడు. వరుసలో ఉన్నప్పటికీ ఇప్పటివరకు సీరియల్ నంబర్ ఇవ్వలేదు. కానీ అర్ధరాత్రి వేళ సిఫారసులతో వచ్చిన వాహనాలను వరుసగా ఫ్యాక్టరీలోకి వెళ్తుండటంతో ప్రశ్నించగా, అక్కడి సిబ్బంది, దళారులు ఇక్కడి నుంచి వెళ్లిపో అంటూ దురుసుగా ప్రవర్తించారు. కుంగిపోయిన లోకేశ్ ఒంటిపై డీజిల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అక్కడున్న రైతులు అడ్డుకున్నారు.

More in Local