← Back to news

డిప్యూటేషన్ వివాదం.. దళిత కార్యదర్శికి న్యాయం కావాలి

By Anguli Malaji· 1d ago· Palem, Morthad, Nizamabad
డిప్యూటేషన్ వివాదం.. దళిత కార్యదర్శికి న్యాయం కావాలి

నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి పంచాయతీ కార్యదర్శి సౌడ రంజిత్ కుమార్ డిప్యూటేషన్ వివాదం ముదిరింది. నాలుగు నెలల క్రితమే బదిలీపై వచ్చిన ఆయనను మళ్లీ మార్చేందుకు యత్నాలు జరుగుతున్నాయని ఆరోపణలు. బదిలీలపై నిషేధం ఉన్న సమయంలో తనను మార్చడం మానసిక ఇబ్బందులకు గురిచేస్తోందని దళిత ఉద్యోగి రంజిత్ కుమార్ ఆవేదన. తనకు న్యాయం చేయాలని కోరారు. ఆయనను జక్రాన్‌పల్లిలోనే కొనసాగించాలంటూ పంచాయతీ పాలకవర్గ సభ్యులు జిల్లా ఉన్నతాధికారులకు వినతిపత్రం అందజేశారు.

More in Local