స్కూల్ ఫీజులు, ప్రభుత్వ బడులపై 27న TPF కీలక సమావేశం

TG: తెలంగాణ పీపుల్స్ ఫ్రంట్ <a href="https://www.theclearcutnews.com/n/dros86J">(TPF) నిర్వహణలో</a> ఈ నెల 27న రౌండ్ టేబుల్ సమావేశం జరగనుంది. ప్రైవేట్ స్కూల్స్ ఫీజుల కంట్రోల్, ప్రభుత్వ బడుల బలోపేతం, విద్యారంగానికి బడ్జెట్‌లో 18 శాతం అలొకేషన్ వంటి అంశాలపై చర్చించనున్నారు. ఉదయం 10:30 గంటలకు మేడ్చల్ జిల్లాలోని గబ్బిలాలపేట రేషన్ షాప్ దగ్గరలో కార్యక్రమం ప్రారంభం కానుంది. ప్రొఫెసర్ పద్మజ షా, మాజీ IAS అధికారులు ఆకునూరి మురళి, MV రెడ్డి, M. చంపాలాల్ మరికొందరు ముఖ్య వ్యక్తలుగా పాల్గొననున్నారు.



