← Back to news

తమిళనాడులో RSS మార్చ్

By Sahani· 22h ago· X
తమిళనాడులో RSS మార్చ్

తమిళనాడులో RSS రూట్ మార్చ్‌కి మద్రాస్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అక్టోబర్ 25, నవంబర్ 1 తేదీల్లో 128 ప్రాంతాల్లో మార్చ్ నిర్వహించుకోవచ్చని స్పష్టం చేసింది. కోర్టు గతంలో తిరస్కరించిన పాత కారణాలనే చెబుతూ పోలీసులు పదే పదే పర్మిషన్ నిరాకరించడంపై జస్టిస్ V.లక్ష్మీనారాయణన్ తీవ్రంగా మండిపడ్డారు. జమ్మూకశ్మీర్‌లోనే RSS మార్చ్‌లు జరిగినప్పుడు తమిళనాడులో ఎందుకు ఆంక్షలని ప్రశ్నించారు. భవిష్యత్తులో ఇలాంటి పర్మిషన్లు ఆపొద్దని, అరేంజ్మెంట్స్ కోసం నిర్వాహకులు ముందే అప్లై చేసుకోవాలని కోర్టు ఆదేశించింది.

More in National