13న చంద్రబాబుతో CM విజయ్ కీలక భేటీ!

AP: తమిళనాడు CM విజయ్ ఈనెల 13న విజయవాడలో CM చంద్రబాబును భేటీ కానున్నారు. తెలుగు గంగ ప్రాజెక్టు కింద తమిళనాడుకు రావాల్సిన కృష్ణా జలాల కొరత, ఏపీ ప్లాన్ చేస్తున్న డ్యామ్‌లు, నదుల లింక్ చేసే అంశంపై చర్చించనున్నారు. ఒప్పందం ప్రకారం ఏటా 12 TMCల నీరు అందాల్సి ఉండగా, అక్టోబర్ 9 నాటికి కేవలం 2.251 TMCలే అందాయి. ఈ పర్యటనలో AP డిప్యూటీ CM పవన్ కల్యాణ్‌తోనూ విజయ్ భేటీ అయ్యే ఛాన్స్ ఉంది.



