చండీగఢ్‌లో CECపై కాంగ్రెస్ ఫైట్
CEC జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ పంజాబ్ యూత్ కాంగ్రెస్ చండీగఢ్‌లో భారీ నిరసన చేపట్టాయి. పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ సింగ్ రాజా వారింగ్ నాయకత్వంలో కార్యకర్తలు ఎలక్షన్ కమిషన్ ఆఫీస్ వైపు వెళ్తుండగా పోలీసులు బారికేడ్లతో అడ్డుకున్నారు. కార్యకర్తలు బారికేడ్లను తోసుకుని వెళ్లేందుకు యత్నించగా, పోలీసులు వాటర్ కానన్ ప్రయోగించి కొందరిని అదుపులోకి తీసుకున్నారు.


