ప్రయాణికులపైకి దూసుకొచ్చిన బస్సు

గుంటూరు జిల్లా మంగళగిరి ఆర్టీసీ బస్టాండ్లో శుక్రవారం ప్రమాదం చోటుచేసుకుంది. 6వ నంబర్ ప్లాట్ఫామ్ వద్దకు వచ్చిన ఆర్టీసీ బస్సు అదుపుతప్పి ప్రయాణికులపైకి దూసుకెళ్లింది. బ్రేకులు ఫెయిల్ కావడంతోనే ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ప్లాట్ఫామ్పై ఉన్న పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. వెంటనే స్పందించిన ఆర్టీసీ సిబ్బంది క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. బస్సు అదుపుతప్పడంతో బస్టాండ్లో ఒక్కసారిగా భయాందోళన నెలకొంది.



