← Back to news

వరికి ప్రత్యామ్నాయ పంటలు వేయాలి: కలెక్టర్

By DK· 8h ago· నిర్మల్ జిల్లా
వరికి ప్రత్యామ్నాయ పంటలు వేయాలి: కలెక్టర్

వాతావరణ పరిస్థితుల దృష్ట్యా తక్కువ నీటితో సాగయ్యే ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులను ప్రోత్సహించాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో వ్యవసాయ అంశాలపై నిర్వహించిన సమీక్షలో వరికి బదులుగా ఇతర పంటల సాగుపై దృష్టి పెట్టాలన్నారు. వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో రైతులకు సహకరించాలని, నీటి కొరతతో పంట నష్టాలు జరిగితే వివరాలను పారదర్శకంగా సేకరించాలని సూచించారు.

More in Local