"మోదీ పిరికి నేత": అభిజీత్

CJP లీడర్లు అశుతోష్, సౌరవ్ దాస్‌లను 5 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ కోర్టు. ఈ పిరికి చర్యల బదులు, దమ్ముంటే అఫీషియల్‌గా ఎమర్జెన్సీ ప్రకటించాలని అభిజీత్ దిప్కే.. ప్రధాని మోదీని విమర్శించారు. జంతర్ మంతర్‌ను ప్రొటెస్ట్ స్థలంగా డీనోటిఫై చేశాక, అశుతోష్, సౌరవ్ దాస్, అజింక్య షిండే సహా 14 మంది.. అక్టోబర్ 13న జంతర్ మంతర్‌లోకి వెళ్లి, జెండా ఎగరేశారు. ట్రెస్పాస్, బాండ్ షరతుల ఉల్లంఘన, పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.


