← Back to news

ప్రభుత్వ బడులకు 18 శాతం నిధులు కేటాయించాలి: సృజన యాదవ్

By Lokesh· 5h ago
ప్రభుత్వ బడులకు 18 శాతం నిధులు కేటాయించాలి: సృజన యాదవ్

TG: తెలంగాణ పీపుల్స్ ఫ్రంట్ బస్ యాత్రలో భాగంగా అంబేద్కర్ విగ్రహం వద్ద సృజన యాదవ్ మాట్లాడారు. ప్రభుత్వ బడులు నిర్లక్ష్యానికి గురవుతున్నాయని అన్నారు. వార్షిక బడ్జెట్‌లో ప్రభుత్వ పాఠశాలలకు 18 శాతం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ పాఠశాలల్లో భారీ ఫీజులు చెల్లించడం మధ్యతరగతి కుటుంబాలకు భారంగా మారిందన్నారు. శిథిలావస్థకు చేరిన ప్రభుత్వ పాఠశాల భవనాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు.

More in TG