← Back to news

విజయవాడకు రాష్ట్రపతి.. రెండు రోజుల పర్యటన

By Sharmila· 10h ago· Newindianexpress
విజయవాడకు రాష్ట్రపతి.. రెండు రోజుల పర్యటన

AP:రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నేటి నుంచి విజయవాడలో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 3గంటలకు అమ్మవారి దర్శనం చేసుకోనున్న రాష్ట్రపతి, రేపు ఉదయం 11 గంటలకు పున్నమి ఘాట్‌లో సరస్ మేళాను స్టార్ట్ చేస్తారు. తర్వాత స్వయం సహాయక సంఘాల మహిళలతో కలిసి భోజనం చేయనున్నారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 5 వేల మంది పోలీసులతో భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఇప్పటికే భద్రతా తనిఖీలు, కాన్వాయ్‌ ట్రయల్ రన్ పూర్తి చేశారు.

More in AP