ఓట్ చోరీపై ఫుల్ ఫోకస్.. 5 రాష్ట్రాల్లో సభలు

ఓట్ చోరీకి వ్యతిరేకంగా తమ పోరాటాన్ని దేశవ్యాప్తంగా విస్తరించాలని ఇండియా కూటమి నిర్ణయించింది. ఢిల్లీలో రాహుల్ గాంధీ నివాసంలో జరిగిన భేటీలో తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల్లో బహిరంగ సభలు నిర్వహించాలని నిర్ణయించారు. దసరా తర్వాత హైదరాబాద్లో భారీ ర్యాలీ, సభ జరగనుంది. ఈ నెల 25, 26 తేదీల్లో సభ జరిగే అవకాశం ఉందని TPCC చీఫ్ మహేశ్ గౌడ్ తెలిపారు. లక్ష్యం సాధించే వరకు పోరాటం ఆపబోమని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.


