దుర్గాఘాట్కు బస్సులు.. Free Transport

AP: విజయవాడలో దసరా ఉత్సవాలకు వచ్చే దివ్యాంగులు, వృద్ధుల కోసం కనకదుర్గ దేవస్థానం ప్రత్యేక ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కల్పించింది. కాళేశ్వరరావు మార్కెట్ నుంచి దుర్గాఘాట్ వరకు వెళ్లేందుకు బస్సులు, ఎలక్ట్రిక్ వాహనాలను సిద్ధం చేసింది. దర్శనం పూర్తయ్యాక దుర్గాఘాట్ నుంచి తిరిగి మార్కెట్కు చేరుకునేందుకు కూడా సౌకర్యం కల్పించింది. దసరా ఉత్సవాల సమయంలో ఘాట్కు వెళ్లడం, తిరిగి రావడంలో వారు ఇబ్బందులు పడకుండా ఈ ఏర్పాట్లు చేశామని తెలిపారు.



