← Back to news

కరెంట్ కోతలపై రైతుల ధర్నా

By DK· 1h ago
కరెంట్ కోతలపై రైతుల ధర్నా

AP: అప్రకటిత విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందంటూ రైతులు ఆందోళనకు దిగారు. శ్రీ సత్యసాయి జిల్లా ఓ.డి.చెరువు మండలం కొండకమర్ల సబ్‌స్టేషన్‌ వద్ద రైతులు ధర్నా నిర్వహించారు. గత 15 రోజులుగా తరచూ విద్యుత్ కోతలు విధించడంతో తాగునీరు, సాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు సకాలంలో లేక బోరుబావుల నీటితో పంటలను కాపాడుకుంటున్న సమయంలో కోతలు మరింత ఇబ్బందులకు గురిచేస్తున్నాయని తెలిపారు.

More in Local