డీలిమిటేషన్ బిల్లులో లోక్ సభ సీట్లు 850

డీలిమిటేషన్, మహిళా బిల్లులకు రంగం సిద్ధమైంది! ఈనెల 16న పార్లమెంట్‌లో వీటిని ప్రవేశపెట్టనున్నారు. దీనివల్ల లోక్ సభ సీట్లు 850కి (రాష్ట్రాలు: 815, UTs: 35) పెరిగే ఛాన్స్ ఉంది. దక్షిణాదికి అన్యాయం జరగకుండా అన్ని రాష్ట్రాల్లో సగటున 50% సీట్లు పెంచాలని ప్లాన్ చేస్తున్నారు. దీనితో పాటు SC, ST రిజర్వేషన్ సీట్లు కూడా పెరుగుతాయి.



