ఆస్పత్రిలోని పేషంట్లకు పండ్ల పంపిణీ

ఖమ్మం జిల్లా పాలేరు ఆత్మ కమిటీ చైర్మన్ చావా శివరామకృష్ణ జన్మదిన వేడుకలను కాంగ్రెస్ శ్రేణులు శుక్రవారం తిరుమలాయపాలెం మండల కేంద్రంలో నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ కేక్ కట్ చేసి పార్టీ నాయకులు, కార్యకర్తలకు పంచిపెట్టారు. అనంతరం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



