ఫిర్యాదులకు డైరెక్ట్ యాక్సెస్.. ‘ఓపెన్ బాక్స్’ ఏర్పాటు

TG: ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు చెన్నూరు ఎమ్మెల్యే, మంత్రి వివేక్ వెంకటస్వామి వినూత్న విధానానికి శ్రీకారం చుట్టారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గ ప్రజల సమస్యలు, ఫిర్యాదులను నేరుగా తన దృష్టికి తీసుకువచ్చేందుకు ‘ఓపెన్ బాక్స్’ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పార్టీ, కులం, మతం, వర్గం అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరి సమస్యను తెలుసుకోవడమే తన ఉద్దేశమన్నారు. ప్రజలు తమ సమస్యలు, ఫిర్యాదులు, అవసరమైతే తనపై ఉన్న ఫిర్యాదులను కూడా పెన్ను, పేపర్‌పై స్పష్టంగా రాసి బాక్స్‌లో వేయాలని కోరారు.



