← Back to news

మద్రాస్ చెక్స్ ట్రెండ్

By A.Ajay· 12 Oct 2026
మద్రాస్ చెక్స్ ట్రెండ్

బ్రిటిషర్ల కాలంలో మన దేశం నుంచి విదేశాలకు ఎగుమతి అయిన మద్రాస్ చెక్స్ ఇప్పుడు మళ్లీ ఫ్యాషన్‌లో ట్రెండ్‌గా మారుతున్నాయి. తేలికగా ఉండి, గాలి ఆడే ఈ కాటన్ బట్టతో షర్ట్స్, ఫ్రాక్స్, కుర్తీలు, బ్లేజర్లు తయారు చేస్తున్నారు. స్కూల్ యూనిఫామ్స్ నుంచి ఆధునిక ఫ్యాషన్ బట్టల వరకు వీటిని ఉపయోగిస్తున్నారు. విదేశీ డిజైనర్లు కూడా ఈ గళ్ల బట్టను ఎంచుకుంటున్నారు. తక్కువ అలంకరణలతోనే సింపుల్‌గా, స్టైలిష్‌గా కనిపించాలనుకునేవారికి మద్రాస్ చెక్స్ మంచి ఎంపికగా మారుతున్నాయి.

More in Viral