సెలెక్టివ్‌గా తీసేశారు- ప్రకాష్ రాజ్

S.I.Rని పూర్తిగా రద్దు చేయించి, CEC జ్ఞానేష్ కుమార్ అరెస్ట్ అయ్యేలా చెయ్యడమే తమ లక్ష్యం అని ప్రకటించారు నటుడు ప్రకాష్ రాజ్. బెంగళూరు, ఫ్రీడమ్ పార్క్‌లో జరిగిన ‘పీపుల్స్ ట్రిబ్యునల్’ ప్రొటెస్ట్‌లో పాల్గొన్న ఆయన.. PM మోదీ, అమిత్ షాలపై తీవ్రంగా ఫైర్ అయ్యారు. SIR పేరుతో మైనారిటీలు, ఆదివాసీల ఓట్లను సెలెక్టివ్‌గా డిలీట్ చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజల ఓటు హక్కును కాలరాస్తున్నారన్న ఆయన.. డిమాండ్లు నెరవేరే వరకూ పోరాటం ఆగదని హెచ్చరించారు.



