చాయ్‌వాలా నుంచి బార్ ఓనర్‌గా

హన్మకొండలో టీ స్టాల్ నిర్వాహకుడికి బార్ అండ్ రెస్టారెంట్ లైసెన్స్ దక్కడం ఆసక్తికరంగా మారింది. ములుగు బార్ లక్కీ డ్రాలో హనుమకొండ బస్టాండ్ వద్ద టీ స్టాల్ నిర్వహించే వెంకటేశ్‌కు అదృష్టం వరించింది. కలెక్టర్ సమక్షంలో నిర్వహించిన లాటరీలో 349వ నంబర్‌పై ఆయనకు లైసెన్స్ లభించింది. కేవలం ఒక్క దరఖాస్తు మాత్రమే చేసిన వెంకటేశ్‌కు లైసెన్స్ రావడం విశేషం. మొత్తం 376 దరఖాస్తులు రావడంతో నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది.



