ఎయిర్ ఫోర్స్ కోసం J-7C.. నేవీ కోసం వరుణాస్త్రం

భారత ఎయిర్ ఫోర్స్, నేవీ సామర్థ్యాన్ని పెంచేందుకు కేంద్ర రక్షణ శాఖ 4,106 కోట్ల విలువైన 2 ఒప్పందాలు చేసుకుంది. ఎయిర్ ఫోర్స్ కోసం జీశాట్-7C కమ్యూనికేషన్ ఉపగ్రహానికి సంబంధించి బెంగళూరుకు చెందిన న్యూ స్పేస్ ఇండియాతో 2,563 కోట్ల ఒప్పందం కుదుర్చుకుంది. నేవీ కోసం హైదరాబాద్కు చెందిన భారత్ డైనమిక్స్తో 1,543 కోట్ల విలువైన వరుణాస్త్ర టార్పిడోల సరఫరాకు ఒప్పందం చేసుకుంది. ఉపగ్రహం ద్వారా ఎయిర్ ఫోర్స్ సమాచార వ్యవస్థ మరింత సురక్షితంగా మారనుంది.


