← Back to news

జాతీయ సదస్సులో నెక్కొండ వాసికి ప్రశంసలు

By THOORPATI RAJASHEKAR· 1d ago· Warangal
జాతీయ సదస్సులో నెక్కొండ వాసికి ప్రశంసలు

జాతీయ సదస్సులో పరిశోధనా వ్యాసాన్ని ప్రదర్శించిన వరంగల్ జిల్లా నెక్కొండకు చెందిన బోడ వీరుభాయ్ ప్రశంసలు అందుకున్నారు. హైదరాబాద్‌లోని MANUUలో ‘టెక్స్టైల్ ట్రెడిషన్స్ ఆఫ్ దక్కన్: మెటీరియాలిటీ, లేబర్ అండ్ టెక్నాలజీ’ ఇతివృత్తంతో నిర్వహించిన సదస్సులో ఆయన తన పరిశోధనా వ్యాసాన్ని ప్రదర్శించారు. ఈ సందర్భంగా సర్టిఫికెట్ అందుకున్నారు. కురుక్షేత్ర విశ్వవిద్యాలయం పర్షియన్ విభాగాధిపతి పుష్ప శర్మ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు వీరుభాయ్‌ను అభినందించారు.

More in Local