← Back to news

'రేవంత్ రెడ్డి పవర్‌లోకి రాగానే హిట్లర్‌లా మారారు'

By DK· 9 Jun 2026· Bigtvlive· హైదరాబాద్‌
'రేవంత్ రెడ్డి పవర్‌లోకి రాగానే హిట్లర్‌లా మారారు'

TG: CM రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు బట్లర్‌లా ఉండి.. పవర్‌లోకి రాగానే హిట్లర్‌గా మారారని భువనగిరి మాజీ MP, బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్ విమర్శించారు. మంగళవారం నాంపల్లి BJP స్టేట్ ఆఫీస్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన వాగ్ధానాలు అమలు చేసే దమ్ములేదని, ఆ పార్టీ నాయకులకు మైక్ దొరికితే మాత్రం బీజేపీని, కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని తిడుతున్నారన్నారు. మెట్రో, RRRకి కిషన్ రెడ్డి నిధులు తెస్తే రేవంత్.. మూసీ నదిలో గడ్డి పీకడానికి ఉన్నారా? అని ప్రశ్నించారు.

More in Politics