← Back to news

పెద్ద టక్లిలో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం

By DK· 1d ago
పెద్ద టక్లిలో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం

TG: అర్హులైన ప్రతిఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు. కామారెడ్డి జిల్లా డొంగ్లీ మండలం పెద్ద టక్లి గ్రామంలోని పోలింగ్ స్టేషన్ నం.10లో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్త ఓటర్ల నమోదు, ఓటరు జాబితాలో సవరణలు, మార్పులు, చేర్పులకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరించారు. ఓటరు జాబితా ప్రక్రియపై ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ విలాస్ గాయక్వాడ్, బీఎల్ఓ సూపర్వైజర్, బీఎల్ఓ, తదితరులు హాజరయ్యారు.

More in Local