10న మూడు అనువాద పుస్తకాల ఆవిష్కరణ

TG: సామాజిక సత్యాలను ప్రతిబింబించే మూడు అనువాద పుస్తకాల (అదృశ్యకథనం, నిషేధిత పుస్తకాల లైబ్రరీ, మూక)ను ఛాయ బుక్స్ సంస్థ ఆవిష్కరిస్తోంది. ఈ కార్యక్రమం హైదరాబాద్ నగరం లామకాన్‌లో జరుగుతుంది. ప్రముఖ నటుడు, సామాజికవేత్త ప్రకాష్‌రాజ్ ముఖ్యఅతిథిగా సెప్టెంబర్ 10 గురువారం సాయంత్రం 6 గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది. జర్నలిస్ట్ కె.శ్రీనివాస్, మీడియా అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ, కవయిత్రి మెర్సీ మార్గరెట్, అనువాదకులు కె.సత్యరంజన్, అరిపిరాల సత్యప్రసాద్, మానస ఎండ్లూరి పాల్గొననున్నారు.



