← Back to news

ట్రాఫిక్‌ సమస్యలపై కంప్లయింట్ చేయొచ్చు

By A.Ajay· 1d ago
ట్రాఫిక్‌ సమస్యలపై కంప్లయింట్ చేయొచ్చు

TG: హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ రద్దీ, పార్కింగ్‌ సమస్యలు, రహదారి భద్రతపై కంప్లయింట్ చేసేందుకు ట్రాఫిక్‌ పోలీసులు కొత్త <a href="https://echallan.tspolice.gov.in/htp/">వెబ్‌సైట్‌</a>ను అందుబాటులోకి తెచ్చారు. హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌ ఈ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌ వివరాలు, పార్కింగ్‌ జోన్ల సమాచారం కూడా ఇందులో తెలుసుకోవచ్చు. ట్రాఫిక్‌ సమస్యలపై సూచనలు ఇచ్చేందుకు కూడా అవకాశం కల్పించారు. హెల్ప్‌లైన్‌ నంబర్‌ 9010203626 ద్వారా ట్రాఫిక్‌ పోలీసులను సంప్రదించవచ్చు.

More in TG