దళిత నాయకుడి పట్ల వివక్ష..చర్యలకు వినతి

ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పట్ల వివక్ష చూపుతూ శుద్ధీకరణ చేపట్టిన ఘటనపై చర్యలు తీసుకోవాలని మిడ్జిల్ మండల కాంగ్రెస్ ఎస్సీ సెల్ నాయకులు డిమాండ్ చేశారు. మిడ్జిల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసి, ఘటనకు బాధ్యులైన బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ నాయకులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో మహబూబ్‌నగర్ డీసీసీ లీగల్ సెల్ వైస్ చైర్మన్ గడ్డల రాజేష్, మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు రాచమల్ల చెన్నయ్య పాల్గొన్నారు.



