← Back to news

RTC బస్సు ఢీకొని 8th క్లాస్ స్టూడెంట్ మృతి

By Sharmila· 2h ago
RTC బస్సు ఢీకొని 8th క్లాస్ స్టూడెంట్ మృతి

TG: హైదరాబాద్‌ నగరం బాలానగర్‌లో విషాదం జరిగింది. తల్లితో కలిసి స్కూటీపై ట్యూషన్‌కు వెళ్తున్న 13 ఏళ్ల నవ్యశ్రీసత్యను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. గురువారం సాయంత్రం బాలానగర్‌ కమాన్‌ దగ్గరలో ఈ ప్రమాదం జరిగింది. బస్సు ఢీకొనడంతో స్కూటీపై వెనుక కూర్చున్న బాలిక అదుపుతప్పి కిందపడగా, బస్సు టైరు కింద పడి తీవ్రంగా గాయపడింది. హాస్పిటల్‌కు తెసుకెళ్లిన అప్పటికే చనిపోయినట్లు డాక్టర్స్ తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

More in TG