← Back to news

ఆ మహిళా ప్రొటెస్టర్ ఎవరు?

By Krishna· 1d ago· X

ఇటీవల ఢిల్లీ.. జంతర్ మంతర్ దగ్గర ఓ మహిళ స్కిన్ షో చేస్తూ.. CJP ప్రొటెస్టులో పాల్గొన్నట్లుగా ఓ వీడియో వైరల్ అయ్యింది. ఆ వీడియోని షేర్ చేస్తున్నవారు Gen Zకి సంస్కారం లేదని విమర్శలు చేస్తున్నారు. ఐతే, అది నిజమైన వీడియో కాదనీ, AI జనరేట్ చేసినది అని BOOM ఫ్యాక్ట్‌చెక్ టీమ్ స్పష్టం చేసింది. ఇలాంటి సెక్సువలైజ్డ్ AI ఫేక్‌లు, డీప్‌ఫేక్‌లు సర్క్యులేట్ అవుతున్నాయని ఇండియా టుడే, క్వింట్, ఆల్ట్ న్యూస్ వంటి ఫ్యాక్ట్‌చెక్‌లు నిర్ధారించాయి. ఇలాంటి కంటెంట్‌ని నమ్మకుండా జాగ్రత్త పడాలని నిపుణులు సూచిస్తున్నారు.

More in National