← Back to news

మాట ఇచ్చారు.. మండపం నిర్మించి నిలబెట్టుకున్నారు

By DK· 2d ago
మాట ఇచ్చారు.. మండపం నిర్మించి నిలబెట్టుకున్నారు

TG: కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని 24వ వార్డులో వినాయక నవరాత్రి ఉత్సవాల కోసం మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ మండపాన్ని నిర్మించారు. ఎన్నికల ప్రచార సమయంలో వార్డు ప్రజలు మండపం నిర్మించాలని కోరగా, ఉత్సవాలకు ముందే నిర్మిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం మండపం నిర్మించడంతో 24వ వార్డు ప్రజలు చైర్మన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో బూరుగుపల్లి రాము, అఖిల్, రాజేష్, సాగర్, వీరస్వామి, పాపయ్య, నాని, తేజ, శ్రీరామ్, సురేష్, పోచాలు తదితరులు పాల్గొన్నారు.

More in Local