← Back to news

కరువుపై రైతులను ఆదుకోవాలి: సీపీఐ డిమాండ్..!

By Jagadish· 18h ago
కరువుపై రైతులను ఆదుకోవాలి: సీపీఐ డిమాండ్..!

కర్నూలు జిల్లా పత్తికొండలో ఎండిపోయిన పంటలను సీపీఐ జాతీయ కార్యదర్శి కె. రామకృష్ణ పరిశీలించారు. ఎల్నినో ప్రభావంతో ఎప్పుడూ లేనంతగా కరువు పరిస్థితులు నెలకొన్నాయని ఆయన అన్నారు. రూ. వేలు పెట్టుబడి పెట్టి సాగు చేసిన పంటలు ఎండిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. రైతుల బ్యాంకు రుణాలు మాఫీ చేయాలని, పంట నష్టపరిహారం కింద ఎకరాకు రూ.50 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గ్రామాల్లో వలసలు ఆపేందుకు ఉపాధి పథకం కింద పనులు కల్పించాలన్నారు. బృందంలో రైతు సంఘం నాయకులు రామచంద్రయ్య, గిడ్డయ్య, కాటమయ్య, లెనిన్ పాల్గొన్నారు.

More in Local