← Back to news

భక్తిశ్రద్ధలతో కుంకుమార్చన పూజలు

By Md Jabeer· 8h ago· నిర్మల్ జిల్లా
భక్తిశ్రద్ధలతో కుంకుమార్చన పూజలు

నిర్మల్ జిల్లా నర్సాపూర్ జి మండల కేంద్రంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆజాద్ యూత్ దుర్గాదేవి సంఘం ఆధ్వర్యంలో అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించారు. స్థానిక మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితుల మంత్రోచ్ఛారణలు, ధూపదీప నైవేద్యాలతో మండపం వద్ద ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ఆజాద్ యూత్ సభ్యులు, భక్తులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

More in Local