గర్ల్స్‌కు ఫేవరెట్‌గా వాచ్ పార్టీలు

TG: హైదరాబాద్‌లో మహిళల కోసం నిర్వహిస్తున్న వాచ్ పార్టీలు కొత్త ట్రెండ్‌గా మారుతున్నాయి. 2000ల నాటి రొమాంటిక్ కామెడీ సినిమాలు చూస్తూ, ఇష్టమైన క్యారెక్టర్ల గురించి మాట్లాడుకుంటూ కొత్త స్నేహాలు పెంచుకుంటున్నారు. ఖాజాగూడలో ‘ది సోషల్ బ్రూ’ ఆర్గనైజర్లు దరానీ పీజే థీమ్‌తో పార్టీ నిర్వహించారు. మరో ఆర్గనైజర్ హీనా 15–20 మంది అమ్మాయిలతో ఇలాంటి ఈవెంట్స్ చేస్తున్నారు. సినిమాలు చూడటమే కాదు.. మహిళలు హాయిగా కలుసుకుని మాట్లాడుకునే వేదికలుగా ఇవి మారుతున్నాయి.
