కాత్యాయని రూపంలో దర్శనమిచ్చిన సరస్వతి అమ్మవారు

నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో శారదీయ శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం ఆరోరోజు అమ్మవారు కాత్యాయని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కాత్యాయని అమ్మవారిని పూజిస్తే మహిళలకు మంచి భర్త లభిస్తాడని భక్తుల విశ్వాసం. మహిళా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీంతో దేవస్థానంలో భక్తుల రద్దీ నెలకొంది.



