← Back to news

మెడికవర్‌లో చిన్నారి మృతిపై తల్లిదండ్రుల నిరసన

By Nani Eluri· 22h ago· Munsifdaily

TG: సికింద్రాబాద్ మెడికవర్ హాస్పిటల్‌లో రెండేళ్ల చిన్నారి గుణశ్రీ మృతి ఘటనపై తల్లిదండ్రులు నిరసనకు దిగారు. MRI స్కాన్ సమయంలోనే పాప చనిపోయిందని, కానీ సాయంత్రం వరకు ట్రీట్‌మెంట్ ఇస్తున్నామని చెప్పారని ఆరోపించారు. అనస్థీషియా ఇచ్చే ముందు సరైన చెకప్ చేశారా అని ప్రశ్నించారు. తమ పాప మెడికల్ రిపోర్టులు, కేస్ షీట్, MRI, అనస్థీషియా రికార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆసుపత్రి ఎదుట నిరసన చేస్తున్న వాళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

More in TG