కోట్ల విలువైన అలంకరణలో అమ్మవారు

జోగులాంబగద్వాల జిల్లా కేంద్రంలోని రాజవీధి శ్రీవాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో ఆరోరోజు అమ్మవారిని ₹.6 కోట్ల 11 లక్షలతో ధనలక్ష్మి దేవిగా అలంకరించి భక్తులకు దర్శనమిచ్చారు. గత 12 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ ప్రత్యేక అలంకరణ సంప్రదాయాన్ని ఈ ఏడాది కూడా కొనసాగించినట్లు ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు ఆలూరు బిలకంటి రాము తెలిపారు. అమ్మవారి కృపతో వర్షాలు కురిసి, పాడిపంటలు సమృద్ధిగా పండాలని ప్రార్థించినట్లు చెప్పారు.





