గిరిజన గ్రామాలకు రహదారి కష్టాలు

అల్లూరి జిల్లా జి.కే. వీధి మండలంలో భారీ వర్షాలకు రోడ్డుపై పెద్ద గుంతలు పడ్డాయి. ఆరు గ్రామాలకు వెళ్లేదారి బ్లాక్ కావడంతో పేసా వైస్ ప్రెసిడెంట్ బాలకృష్ణ, మాజీ వాలంటీర్ సన్యాసిరావు 3 రోజులు కష్టపడి ఆ గుంతలను పూడ్చారు. ఎన్ని దరఖాస్తులు ఇచ్చినా గవర్నమెంట్ పట్టించుకోలేదని, ఈ రోడ్డు ప్రాబ్లమ్కి పర్మనెంట్ సొల్యూషన్ చూపాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.



